కొత్తపట్నం ఎంపీటీసీపై స్పందనలో మహిళా వైద్యుల ఫిర్యాదు – ముగ్గురు కమిటీ సభ్యులతో కమిటిని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా

కొత్త పట్నం సర్వసభ్య సమావేశంలో ఆ మండల వైద్యాధికారిణి వైష్ణవిపై అసభ్య పదజాలం ఉపయోగించి దురుసుగా వ్యవహరించిన ఎంపీటీసీ రామలింగం వెంకట రావుపై ఆ మండల వైద్యాధికారిణి వైష్ణవి ఇతర మహిళా వైద్యులతో కలిసి వెళ్లి స్పందనలో ఫిర్యాదు చేసారు. తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటిని వేసి విచారణకు ఆదేశించారు. మహిళా డాక్టర్ ను అసభ్య పద జాలంతో దూషించటాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రాధమిక వైద్యుల సంఘంజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రాహూల్, డాక్టర్ షేక్ ఖాదర్ మస్తాన్ బిలు తీవ్రంగా ఖడించారు. ఇటువంటి సంఘటనలు మహిళా వైద్యుల ఆత్మాభిమాన్ని దెబ్బతీస్తాయని, సంఘటనలు ఉపేక్షించరాదని ఇన్చార్జి జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్, జిల్లా ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ అన్నారు. సంఘటనను జిల్లా వైద్యులు ఖడించారు. సంఘటనపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *