ఉపాధ్యాయులందరూ బాధ్యతగా పనిచేయాలని డీఈవో సామా సుబ్బారావు సూచించారు. తాళ్లూరులోని వీకే ప్రభుత్వ
ఉన్నత పాఠశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా పాఠశాల పరిసరాలు పరిశీలించారు. అనంతరం పాఠశాలలో రికార్డులు తనిఖీచేశారు. వాటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తదుపరి ఉపాధ్యాయులు, సిబ్బందితో సమావేశమయ్యారు. విద్యా
ర్థులకు పాఠ్యాంశాలు అర్ధమయ్యేలా బోధించాలన్నారు. సబ్జెక్టుల వారీగా వారి పురోగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. విద్యాపరంగా వెనుకబడిన వారిని గుర్తించి వారిపై మరింత శ్రద్ధతీసుకోవాలన్నారు. వీకే ఉన్నత పాఠశాలలో పలువురు ఉపాధ్యాయులు గైర్హాజరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏ బి సి ఉన్నత పాఠశాలను పరిశీలించి స్కూల్ ప్రొఫైల్ పూర్తి చేయాల్సిన విధానము, రికార్డులను పరిసరాలను వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కే వెంకటేశ్వరరావు, డైరెక్టర్ కాలేష బాబు బాబు, ఉపాధ్యాయులకు లకు తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈవో – 2 ఎల్.సుధాకరరావు
తదితరులు పాల్గొన్నారు.
పలు పాఠశాలను పరిశీలించిన డీఈవో సామా సుబ్బారావు- బాధ్యతతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు
22
Oct