రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి, ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవి కుమార్ , డా. డోలా శ్రీ బాల వీరాంజయ స్వామి పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, శాసన మండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్, పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కందుకూరు శాసన సభ్యులు దామాచర్ల జనార్ధన రావు, కందుల నారాయణ రెడ్డి, డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, డా. బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ఇంటూరు నాగేశ్వర రావు, బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గృహ నిర్మాణ శాఖ, విద్యుత్ శాఖ తదితర శాఖలకు సంబంధించిన అజెండా అంశాలపై చర్చించగా, పలువురు జడ్పిటిసి, ఎంపీపీలు పలు సమస్యలను మంత్రులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకురావడం జరిగింది.
మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. .. ఈ రోజు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకాయమ్మ అధ్యక్షతన జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ , గృహ నిర్మాణ శాఖ, విద్యుత్ శాఖ తదితర శాఖలకు సంబంధించి అనేక అంశాలపై శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జడ్పిటిసి, ఎంపిపి సభ్యులు పలు సమస్యలను ప్రస్తావించడం జరిగిందని మంత్రి తెలిపారు. సభ్యులు ప్రస్తావించిన సమస్యలన్నింటినీ పరిషరించే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పేద వానికి సంక్షేమ పధకాలు ఆందాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేసి సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ధిదారునికి అందేలా పని చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. పారదర్శకంగా ఇసుక ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డా. డోలా శ్రీ బాల వీరాంజయ స్వామి మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గృహ నిర్మాణ శాఖ, విద్యుత్ శాఖలకు సంబంధించి అమలు జరుగుచున్న కార్యక్రమాల అమలుపై చర్చించడం జరిగిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అంటు వ్యాధులు ప్రబల కుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించి భారీ వర్షాల కారణంగా నష్ట పోయిన పంట వివరాలను క్షేత్ర స్థాయిలో అంచనాలు తయారు చేయడం, రైతాంగానికి అవసరమైన ఎరువులు సలహాలు సూచనలు ఇవ్వడం చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్షిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు శాతం పెరిగేలా, మరియు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ప్రవేటు బ్లడ్ బ్యాంకు ల నుండి ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన బ్లడ్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. గ్రామాలా అభివృద్దే లక్ష్యంతో ఉపాధి హామీ పధకం ద్వారా అవసరమైన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంతో 200 కోట్ల రూపాయలకు పైగా సీసీ రోడ్లు, సైడు కాలువలు, క్యాటిల్ షెడ్స్ తదితర పనులను పెద్దఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. సభ్యులు కోరిన విధంగా ప్రతి మండలంలో సదరన్ క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన ప్రతిఒక్కరికీ మెడికల్ సర్టిఫికెట్స్ జారిచేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి అర్హత కలిగిన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
శాసన మండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, 2014-19 మద్య కాలంలో ఉపాధి హామీ పధకం కింద చాల వరకు పాఠశాలల్లో క్రీడా మైదానాలకు లేవలింగ్ పనులు అలాగే చెరువుల పూడిక తీత పనులు చేపట్టి ఆ మట్టితో రైతుల పొలాల్లో లేవలింగ్ పనులు చేపట్టడం జరిగిందని, నేడు అదే విధంగా ఉపాధి పధకం కింద పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటే రైతులకు ఉపయోగంగా ఉంటుందని మంత్రుల దృష్టికి తీసుకు రావడం జరిగింది.
ఒంగోలు శాసన సభ్యులు దామాచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ.. .. జిల్లాలో ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టిన అంగన్ వాడీ భవనాలు, సైడు డ్రైన్స్ నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ లో వున్న బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని మంత్రుల దృష్టికి తీసుకు వచ్చారు.
కనిగిరి శాసన సభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. .. ఇరిగేషన్ కెనాల్స్ లో జంగిల్ క్లియరెన్స్ చేయడం తో పాటు నగర పంచాయాతీల్లో విలీనమైన పంచాయతీల్లో ప్రజలకు ఉపాధి హామీ పధకం ద్వారా పనులు కల్పించాలని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ వుంది అని, అయితే డ్రైవర్ లేరని డ్రైవర్ నియామకం చేపట్టాలన్నారు.
మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. … పశ్చిమ ప్రాంతంలో భూగర్భ జలాల మట్టం గణనీయంగా తగ్గిపోయాయని, భూగర్భ జలాల మట్టం పెరిగేలా నీటి సంరక్షణ కు పెద్ద ఎత్తున చెక్ డ్యాం ల నిర్మాణాలు చేపట్టాలని, చేపట్టిన చెక్ డ్యాం ల పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న ప్రతి ఏకరాన్ని పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
దర్శి శాసన సభ్యులు డా. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దర్శి నియోజక వర్గంలో పంటలు దెబ్బ తిన్నాయని, ఏ ఒక్క రైతు నష్ట పోకుండా నష్టం అంచనాలను రూపొందించాలని కోరారు.
తొలుత ఇటీవల మరణించిన గుడ్లూరు జడ్పిటిసి సభ్యులు కె. బాపిరెడ్డి మృతి పట్ల సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ శ్రీ చిరంజీవి, డ్వామా, డి.ఆర్.డి.ఏ, వ్యవసాయ, వైద్య ఆరోగ్య శాఖ, గృహ నిర్మాణ, విద్యుత్ శాఖలకు సంబంధించి ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.










