ప్రకాశం జిల్లా దర్శి నియోజక వర్గం, తాళ్లూరు మండలంకు చెందిన కైపు వెంకట క్రిష్ణా రెడ్డి అనార్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ గా నియమితులైనారు. ఆమేరకు పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్భంగా కైపు వెంకట క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ ఆన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కార్మికులు హక్కుల గురించి పార్టీ ప్రత్యేక శ్రర్థ తీసుకుంటుందని అన్నారు. వారు ఎదుర్కోంటున్న ఆనేక సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్మికులు అందరూ రాహూల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్రలో పాల్గొని వారి సమస్యలను వివరించారని చెప్పారు. వారి సమస్యల పరిష్కారినికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. తనపై నమ్మకాన్ని ఉంచి పెద్ద బాధ్యతలు ఉంచిన పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిలా రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
