తాళ్లూరు మండలంలో సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్ సహాయకుల ద్వారా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ కె. సుందర రామయ్య తెలిపారు. మన్నేపల్లి, వెలుగు వారి పాలెం, తూర్పు గంగవరం డిజిటల్ అసిస్టెంట్స్ బి రవీందర్,టి శ్రీను, కె చిన ఆదాంలు శిబిరంలో పాల్గొని ఈనెల 23న శివ రామపురం, నాగంబొట్ల పాలెం, మాధవరంలలో 24, 25లలో మల్కాపురం, బొద్దికూర పాడు, దోస కాయల పాడులలో క్యాంపులు నిర్వహించబడునని చెప్పారు. ఆధార్ ప్రత్యేక శిబిరం లో అవసరమైన వారు ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ కోరారు.
ప్రత్యేక ఆధార్ శిబిరం లు ఉపయోగించుకోండి – ఎంపీడీఓ సుందర రామయ్య
22
Oct