ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు నడపాలని, ఎమ్మార్పీ ధరలకే మద్యాన్ని అమ్మాలని దర్శి ఎక్సైజ్ సీఐ కె.శ్రీనివాసరావు అన్నారు. దర్శి నియోజకవర్గ పరిధిలో ప్రారంభించిన మద్యం దుకాణాల వద్ద మంగళవారం ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి రాత్రి పది గంటల వరకు దుకాణాలు తెరవాలని, నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

