జిల్లాలో ప్రకృతి వ్యవసాయం పెంచి, పర్యావరణాన్ని పెంచటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మెనేజర్ బి సుబాషిణి అన్నారు. బెల్లంకొండ వారి పాలెం, లక్కవరం, దోసకాయల పాడు గ్రామాలలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమం వ్యవసాయాధికారి బి ప్రసాద రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీపీఎం సుభాషిణి మాట్లాడుతూ జిల్లాలో 38,500 మంది రైతులతో 42,255 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయ సాగు చేయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పాటించాల్సిన సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో విఏఏలు భార్గవి, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



