విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దక్షిణాంధ్ర ప్రాంత సత్సంగ వర్గ మల్లవరం వాసవి సత్రం నందు నేడు, రేపు శని, ఆదివారాలు 26 27 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ప్రాంత సత్సంగ్ ప్రముఖు సోమ సుబ్బారావు తెలిపారు. సత్సంగం ద్వారా ప్రతి ఒక్కరిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడం, వారిలో నిగూఢమైయున్న ఆధ్యాత్మిక భావనలను దేశభక్తిని రగిలించడానికి ఉపయోగపడతాయని, కావున ప్రతి ఊరినుండి దేవాలయాల అనుబంధంగా ఇద్దరు లేక ముగ్గురు సత్సంగ వర్గలో పాల్గొని విశ్వహిందూ పరిషత్ కేంద్ర ప్రాంత ప్రముఖులు తెలిపేటటువంటి జ్ఞాన సంపదను అందుకోవాలని కోరారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సత్సంగ వర్గ తరగతులు జరుగుతుంటాయని వారు తెలిపారు. సత్సంగ్ వర్గలో కేంద్రీయ మంత్రి యక్కలి రాఘవులు, కేంద్ర సత్సంగ్ ప్రముఖు పండరీనాథ్, ప్రాంత సహకార్యదర్శి పర్రే కోటేశ్వరరావు, ప్రాంత సత్సంగ్ ప్రముఖు సోమ సుబ్బారావు, అర్చక పురోహిత మఠ మందిర్ ప్రముఖు శివ శంకర్ మరియు స్వామీజీ చిన్మయానంద విచ్చేసి ప్రేరణాత్మక సందేశాలను ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ వర్గకు దక్షిణాంధ్రా ప్రాంతంలోని 16 జిల్లాల నుండి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు విచ్చేస్తారని తెలిపారు.
