రెవిన్యూ సమస్యల తక్షణ పరిష్కారం – తహసీల్దార్ నాగలక్ష్మి

రెవిన్యూ సమస్యల తక్షణ పరిష్కారం కోసమే ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ నాగలక్ష్మి తెలిపారు. దోసకాయల పాడు గ్రామంలో శనివారం గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగలక్ష్మి మాట్లాడుతూ… గతంలో జరిగిన రీ సర్వేలో ఎవైనా తప్పులు దొర్లి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తమ పరిధిలో ఉన్న వాటిని తక్షణమే పరిష్కరిస్తామని, పరధిలో లేని వాటిని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం వినతులను స్వీకరించారు. విస్తీర్ణం సరి చేయ్యాలని 28 దరఖాస్తులు, జాయింట్ పట్టాల విభజనకు 33, ఆన్లైన్ కోసం నాలుగు దరఖాస్తులు మొత్తం 65 దరఖాస్తులు వచ్చాయి. సర్పంచి కె ఎస్ వెంకట రామి రెడ్డి. రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ ప్రశాంత్, విఆర్ఓ శివా రెడ్డి, గ్రామ టిడిపి నాయకుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *