కాపాడాల్సిన అన్నే కాటేసాడు – చికిత్స పొందుతున్న బాలిక

చెల్లిలికి నీడగా, అండగా నిలవాల్సిన అన్న స్వంత తోబుట్టువును వశ పరుచుకున్న ఘటన మానవ సంబంధాలు నానాటికి దిగజారి పోతున్న వైనం బహిర్గతం చేస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం .. తూర్పుగంగవరంలో ఓ మైనర్ బాలిక ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. ఆబాలిక తన తోటి విద్యార్థులు దుర్గా ప్రసాద్, సన్నీలతో చనువుగా స్నేహం చేస్తున్నది. అందులో సన్నీతో చాటింగ్ చేస్తూ శారీరకంగా దగ్గర అయినది. ఈ పరిస్థితి గమనించిన స్వంత సోదరుడు చెల్లిని బ్లాక్ మొయిల్ చేసి లోబరుచుకున్నాడు. కొంత కాలం తర్వాత గర్భవతి ఆయి అబార్షన్ కావటంతో దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలియటంతో ఎస్సై మల్లిఖార్జున రావు కేసు నమోదు చేసారు. దర్శి డీఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *