ఐదేళ్ల చీకట్లు చీల్చుకుంటూ కొత్త వెలుగుల్లోకి అడుగు పెడుతున్న రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. కొత్త నాయకత్వంలో, కొత్త లక్ష్యాలతో అభివృద్ధిబాటలో రాష్ట్రం ముందుకు సాగుతున్న తరుణంలో వస్తున్న ఈ దీపావళి పండుగ ప్రజలందరీ జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యాలు తేవాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చల్లని, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమర్థ పాలనలో రాష్ట్రంలోని ప్రతి లోగిలి కొత్త వెలుగులు, సంతోషాలతో నిండాలని ఆ భగవంతుడుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.
