జేఈఈ మెయిన్ – ర్యాంకింగ్ కొలమానాల్లో వయసు, హాల్ టికెట్ సంఖ్య తొలగింపు

జేఈఈ మెయిన్లో ఇద్దరు విద్యార్థులకు ఒకే స్కోర్ వచ్చిన సమయంలో ర్యాంకు కేటాయించేందుకు గతంలో తొమ్మిది కొలమానాలు ఉండగా… ఈసారి వాటిని ఏడింటికి కుదించారు. అంటే ఏడు కొలమానాల తర్వాత స్కోర్ సమానంగా ఉంటే ఇద్దరికీ ఒకే ర్యాంకు కేటాయిస్తారు. గతంలో ఉన్న ఎని మిదో కొలమానమైన వయసు, తొమ్మిదోదైన హాల్టికెట్ సంఖ్యను ఈసారి పరిగణనలోకి తీసుకోరు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ర్యాంకింగ్ కేటాయిం పులో మార్పు చేసింది. ఇప్పటివరకు టై అయినప్పుడు తొలుత గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రం, అనంతరం రసాయనశాస్త్రాల స్కోర్ను వరుసగా చూస్తారు. అప్పటికీ
ఒకే స్కోర్ ఉంటే మొత్తం మూడు సబ్జెక్టుల్లో తప్పులు. ఒప్పుల నిష్పత్తి, ఆ తర్వాత వరుసగా గణితం, భౌతి కశాస్త్రం, రసాయనశాస్త్రాల్లో తప్పులు.. ఒప్పుల నిష్పత్తిని చూస్తారు. అంటే తక్కువ మైనస్ మార్కులున్న వారికి మంచి ర్యాంకు కేటాయిస్తారు. అవన్నీ సమానంగా ఉన్న ప్పుడు ఎనిమిదో కొలమానంగా వయసులో ఎవరు పెద్ద అయితే వారికి మంచి ర్యాంకు కేటాయిస్తారు. చివరగా హాల్ టికెట్ నంబరు ఏదీ పెద్దది(అవరోహణ క్రమం) అని చూస్తారు. ఈసారి వయసు, హాల్టికెట్ సంఖ్యను తొలగించారు. అయితే 100 పర్సంటైల్ వచ్చిన వారికి తప్ప మిగిలిన వారికి ఒకే స్కోర్ వచ్చే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *