దర్శి నియోజక వర్గం కురిచేడు మండలంలో దర్శి ఎక్సైజ్ సీఐ కె శ్రీనివాసరావు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. పడమర గంగవరంలో దాడులు చేసి అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన అంకసాని నాగరాజుకు గుర్తించి ఆయన వద్ద నుండి తొమ్మిది 180 మి.లీల కెరళ మాల్టెడ్ ఫైన్ విస్కీని స్వాధీనం చేసుకున్నారు. దాడులలో ఎస్సై విఆర్ సత్యనారాయణ, కానిస్టేబుల్స్ నాగ రాజు, సాయి బాబ, సురేష్ బాబు, ఖాసిం పీరాలు పాల్గొన్నారు.
