రీజనల్ కోఆర్డినేటర్ ను కలిసిన వైసీపీ నాయకులు

ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావును మొదటి సారిగా జిల్లాకు విచ్చేసిన సందర్భంగా తాళ్లూరు మండల వైసీపీ నేతలు ఒంగోలు తరలివెళ్లారు. రీజనల్ కోర్డినేటర్ నాగేశ్వర రావును, పార్లమెంట్ ఇన్చార్జి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని గజమాలతో సన్మానించారు. వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు జి శ్రీకాంత్ రెడ్డి, మాజీ సొసైటీ డైరెక్టర్ గువ్వల శ్రీనివాస రెడ్డి, జి మల్లీశ్వర రెడ్డి, యారం రమణా రెడ్డి, జక్కుల రామక్రిష్ణ సజీవ్, మొర బోయిన తిరుపతయ్య తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *