బంగారు బాలోత్సవాలను విజయవంతం చెయ్యాలని ఎంపీడీఓ సుందర రామయ్య కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా నిర్వహించిన వీడియో కాన్షిరెన్స్ లో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ సుందర రామయ్య మాట్లాడుతూ వారం రోజుల పాటు బంగారు బాల్యానికి శ్రీకారం- బాలోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మన హక్కులు తెలుసుకుందాం, మన కోసం మనం, మా పిల్లలు బాధ్యత, సదా బాలల సేవలో … మా కళలు – మాస్వ ప్నాలు, చేయి చేయు కలుపుదాం.. బంగారు బాల్యం అందిద్దాం అనే ఇతి వృత్తాలతో మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. 0-18 ఏళ్ల బాలల హక్కులు పరిరక్షణ వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసేలా సంబంధిత శాఖ అధికారులతో గ్రామ, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రాప్ అవుట్, బాల కార్మిక,బాల్య వివాహాలు, అనారోగ్యం బారిన పడిన బాలలను గుర్తించి ప్రతి ఒక్కరి పరిస్థితికి తగినట్లు ప్రత్యేక ప్రణాళికలు రూపొదించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవ రావు, ఎంఈఓ-2 సుధాకర్ రావు, ఎఎస్సై మోహన రావు, ఎంపీఎం దేవరాజ్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ జ్యోతి ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
