బొద్దికూరపాడు ఎంఐ ట్యాంక్ లో చేపల వేసి పెంచుకోవటానికి గురువారం పంచాయితీ ఆధ్వర్యంలో వేలం పాటను నిర్వహించారు. సర్పంచి మందా శ్యామ్సన్, ఉప సర్పంచి పులి ప్రసాద రెడ్డి, గ్రామ కార్యదర్శి అల్లం వెంకటేశ్వర్లు పాల్గొని వేలం పాట దారులకు కావలసిన ఏర్పాట్లు చేసారు. అయితే వర్షం కారణంగా ఎవరూ రాక పోవటంతో ఈనెల 18కి వాయిదా వేస్తున్నట్లు గ్రామ సెక్రటరీ అల్లం వెంకటేశ్వర్లు తెలిపారు.
