తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపుపొందిన పాఠశాలలో నేహ్రు జయంతి, బంగారు బాలోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బంగారు బాలోత్సవాలను సందర్భంగా తాళ్లూరు లో ఎబీసీ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ-2 సుధాకర రావు, కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, హెచ్ఎం వెంకటేశ్వరరావు, డైరెక్టర్ కాలేషాబాబులు నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎబీసీ హైస్కూల్, కస్తూరిబాలో బాల కార్మిక రహిత, బాల్య వివాహ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని ఎంఈఓ- 2 సుధాకర రావు ప్రతిజ్ఞ చేయించారు. వెలుగు వారి పాలెం (ఎఎ)లో నెహ్రూజీ కి నివాళులు అర్పించారు. బంగారు బాల్యం ప్రతిజ్ఞ చేయించారు.



