తాళ్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లు శనివారం 93.42శాతం పంపిణి చేసినట్లు ఎంపీడీఓ కె సుందర రామయ్య తెలిపారు. మండలంలో పలు రకాల పెన్షన్లు 6203 ఉండగా శనివారం సాయంత్రానికి 5795 పెన్షన్లు పంపిణీ చేసారు. తురకపాలెంలో మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, తాళ్లూరు యువ నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి లతో పాటు ఆయా గ్రామాలలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిథులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. గ్రామకార్యదర్శి ఐవీ రమణా రెడ్డి తదితరులు తాళ్లూరులో పాల్గొన్నారు.
