పోలీసు సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తా- జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ – కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ

పోలీస్ సిబ్బంది బదిలీలలో భాగంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తుకున్న ఏఎస్ఐ స్థాయి సిబ్బంది నుండి కానిస్టేబుల్ వరకు మొత్తం 195 మందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ బదిలీలు చేశారు. పోలీస్ కల్యాణ మండపంలో శనివారం సిబ్బంది బదిలీల కోసం ఎస్పీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. సీనియార్టీ ఆధారంగా వరుసగా ఒక్కొక్కరూ పిలిచి ఐదు సంవత్సరాలు సర్కిల్ పరిధిలో కాకుండా నేటివ్ ప్లేస్ కాకుండా పనిచేసిన పోలీస్ స్టేషన్ లో కాకుండా మిగిలిన పోలీస్ స్టేషన్ లో ఉన్న ఖాళీలను ప్రత్యక్షంగా స్క్రీన్ పై చూపి వాటిలో వారు కోరుకున్న చోటికి బదిలీ చేసినారు. సాంకేతికత ఉపయోగించి కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందు ప్రతి ఒక్క సిబ్బందికి వారి సర్వీస్ వివరాలు తెలియజేసి, జరగబోయే కౌన్సిలింగ్ గురించి వివరించడం జరిగింది. కౌన్సిలింగ్ జరిగే సమయంలో సిబ్బందికి ఎదురుగా ఒక వైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఖాళీల వివరాలు, రెండోవైపు స్క్రీన్ పై అతని సర్వే వివరాలు మరియు ఎప్పటికప్పుడు వారు కోరుకున్న పోస్టింగ్ ప్రదర్శన అయ్యే విధంగా ఏర్పాటు చేయడమైనది. ఈ అర్హతలతో ఉన్న సిబ్బందిని బదిలీ చేస్తూ అక్కడికక్కడే బదిలీ ఉత్తర్వు/డి.ఒ ప్రతిని సిబ్బంది చేతికి అందజేయడం విశేషం. ఈ విధానంపై సిబ్బంది అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ……. ఓకే చోట ఐదు సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం వలన అక్కడ నుండి వేరే చోటకి వెళ్ళడం కొందరికి బాధగా ఉన్నా మరికొందరికి ఎంతో ఉత్సాహాన్ని, నూతన బాధ్యతలను పెంచుతాయని, నిర్వర్తించే వీధుల్లో పోలీస్ శాఖ యొక్క ప్రతిష్ట పెంపొందించాలని ఆకాక్షించారు.

ఈ కార్యక్రమంలో ASP (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్,ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, DPO ఏవో రామ్మోహనరావు, ఏ ఆర్ డిఎస్పి చంద్రశేఖర్, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, రమణారెడ్డి, సీతారామిరెడ్డి,డిపిఓ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *