తాళ్లూరు మండల మహిళా సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక

తాళ్లూరు మండల మహిళా సమాఖ్య నూతన కమిటీ ని శనివారం ఎక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంఎంఎస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దర్శి ఎరియా కోఆర్డినేటర్ వసుంధరా దేవి, స్త్రీనిథి నియోజక వర్గ మెనేజర్ పవన్ కళ్యాణ్ను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంఎంఎస్ అధ్యక్షు రాలు విజయలక్ష్మి మాట్లాడుతూ తాళ్లూరు మండల మహిళా సమాఖ్య ఐక మత్యంగా విజయపధంలో నడుపడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే పంధాను కొనసాగించాలని కోరారు. ఎసీ వసుంధరా దేవి, స్త్రీ నిథి మెనేజర్ పవన్ కళ్యాణ్కు పలు పథకాలపై, సంఘాల బకాయిలపై సమీక్ష నిర్వహించారు. సంఘ పరపతిని మరింతగా పెంచుకుని అధిక మొత్తంలో రుణాలు పొందవచ్చని చెప్పారు. లక్ పతీ దీదీ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు. నూతన మండల మహిళా అధ్యక్షు రాలిగా ఎం. సుజాత, ఉపాధ్యక్షురాలిగా పులిపాటి లీల కార్యదర్శిగా షేక్ బిబీ జాన్ సహాయ కార్యదర్శిగా పాలెం ధన లక్ష్మి, కోశాధికారిగా ఎస్ భాగ్యలక్ష్మిలు ఎక గ్రీవంగా ఎంపికయ్యారు. తమకు సహకరించి బాధ్యతలు అప్పగించినందుకు నూతన కమిటీ బాధ్యులు ధన్యవాదాలు తెలిపారు. సంఘ అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఎపీఎం దేవ రాజ్, సీసీలు సుచింధ్ర, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *