గ్రంధాలయాల స్వంత భవనాల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి తెలిపారు. స్థానిక గ్రంధాలయాన్ని శనివారం ఆమె పరిశీలించారు. అద్దె భవనంలో గ్రంధాలయం కొనసాగుతుండటంతో గత టిడిపి ప్రభుత్వంలో భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించి నిర్మాణం చేయతల పెట్టారు. అయితే స్థలాన్ని మాత్రమే బాగు చేసారు కాని భవన నిర్మాణం ప్రారంభించలేదు. దీంతో ప్రస్తుత స్థల పరిస్థితిని ఆమె పరిశీలించారు. తాళ్లూరు గ్రంధ పాలకురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
