హెచ్ ఐవీ ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వాలు అందిస్తున్న సేవలు వినియోగించుకోవాలి – ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సేవలను వినియోగించు కోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ర్యాలీని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హెచ్ ఐ వీ ఎయిడ్స్ ఒక్కరి సమస్య కాదని, అందరి సమస్యగా భావించాలని కోరారు. జిజిహెచ్ సూపరిండెంట్ డాక్టర్ జమునా మాట్లాడుతూ…. ఎయిడ్స్ బారిన పడటం వలన కుటుంబాలు, సమాజం మీద దేశం మీద ఆ ప్రభావం చూపుతుందని అన్నారు. డీ ఎల్ ఎస్ ఏ శ్యాం బాబు మాట్లాడుతూ ….హెచ్ ఐవీ ఎయిడ్స్ వ్యాధిని అరికట్టటం లో ప్రజలకు అవగాహన కల్పించటంతో కమ్యూనిటి బెస్ట్ ఆర్గ నైజర్స్, స్వచ్చంధ సంస్థలు వివిధ శాఖల సమన్వయం అవసరమని అన్నారు. డాక్టర్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ ….జాతీయ ఎయిడ్స్ నియంత్రణ విభాగం గుణాంకాల ప్రకారం మన దేశం లో ఆంధ్ర ప్రదేశ్ మూడవ స్థానం లో ఉందని అన్నారు. డీఎం హెచ్ ఓ డాక్టర్ పద్మజ. ఎఆర్ టీ ఎస్ ఎం ఓ డాక్టర్ శ్యామ్యుల్, డాక్టర్ శ్రీ వాణి లు హెచ్ ఐ ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. కార్యక్రమంలో సీపీఎం కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *