తాళ్లూరు గ్రామంలోని సర్వే నంబర్
476లోని 1.80 ఎకరాభూమిని ఆక్రమణల నుండి తొలగించి గృహాలు లేని ఎస్సీలకు, నివేశన స్థలపట్టాలు మంజూరు చేయాలని తాళ్లూరు ఎస్సీ కాలనీకి చెందిన మండల టీడీపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు, అనపర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో కాలనీ వాసులు గ్రీవెన్ సెల్లో అధికారులకు సోమవారం ఫిర్యాధు చేశారు. తాళ్లూరు- వెల్లంపల్లి రోడ్డు మార్గంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ఆనుకుని వున్న1.80 ఎకరాల స్థలాన్ని కాలనీకి చెందిన నల్లూరి బాలనాగయ్య, ఏసోబు కుటుంబీ కులు ఆక్రమించారన్నారు. ఆకుటుంబీకులకుగ్రామంలో మూడు స్వంత గృహాలు వున్నాయని, ప్రభుత్వం అందజేసిన భూమి కూడా వుందన్నారు. గతంలో ఆక్రమణదారుడు ఆ క్రమించిన సర్వేనంబర్ 476లో 4.80 ఎకరాల్లో 2 ఎకరాల్లో కేజీబీవీ విద్యాలయంకు కేటాయించారన్నారు. అందులో 1.80 ఎకరాల స్థలాన్ని ఆక్రమించారన్నారు. గతంలో అనేక మార్లు అధికారులకు విన్నవించగా నిషేదిత బోర్డు ఏర్పా టు చేయగా దానిని పీకి వేసినా స్థానిక అధికారులు చర్యలు తీసు కోలేదన్నారు. ఎస్సీ కాలనీలో చాలా మందికి ఇళ్లు లేక ఒకటే ఇంటిలో తలదాల్చుకుంటూ ఇబ్బం దులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి ఆక్రమణ స్థలంను స్వాధీనం చేసుకుని ఇళ్లులేని ఎస్సీలకు నివేశన పట్టాలు మంజూరు చేయాలని విన్నవించారు.
తాళ్లూరులో ఆక్రమణలో వున్న సర్వేనంబర్ 416లోని భూమిని ఎస్సీలకు ఇళ్ల స్థల పట్టాలకు కేటాయించాలి
09
Dec