ఒక్కటిగా మెలిగితే ఏ ఆపదైనా ఎదుర్కోగలం – హిందూ జన సంఘ్ అధ్యక్షులు విశ్వాజుల లక్ష్మీ నారాయణ మూర్తి- స్ఫూర్తి నింపిన హిందూ జన సంఘ్ సమావేశం.

హిందువులలో చైతన్యం, ఐక్యత పెంచడం, కుల, ప్రాంత వర్గ బేధాలు లేకుండా అందరూ ఒక్కటిగా బంధువులు వలే మెలగాలని, అన్యమతస్తు చేస్తున్న హైంధవ వ్యతిరేక పనులు, ఆలయాల ధ్వసం, హిందూ మహిళల పట్ల, హిందువులపై దౌర్జన్యాలను సమిష్టిగా ఎదుర్కొనడానికి, హిందూ ధర్మం, దేశ పౌరునిగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి హిందూ జన సంఘ్ ప్రారంభించి హిందూ యువకులు, యువతులలో ధైర్య, పోరాట పఠిమను ఉద్దీపన చేయడానికి హిందూ జన సంఘ్ సమావేశాలు ఏర్పాచేస్తూ ఉన్నామని విజయవాడ హిందూ జన సంఘ్ అధ్యక్షులు విశ్వాజుల లక్ష్మీ నారాయణ మూర్తి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రకాశం జిల్లా హిందూ జన సంఘ్ బాధ్యులు బల్చా శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం ఉదయం స్థానిక ఫాన్సీగూడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాలు లో జరిగిన సమావేశంలో పలువురు ప్రసంగించారు.

విజయవాడకు చెందిన ఏ. వేంకటేశ్వర్లు మాట్లాడుచూ భారతదేశం నుండి సెక్యులర్ నాయకుల ద్వారా విడగొట్టబడిన ఎన్నో దేశాలు, అక్కడి పాలకులు ఆయా దేశాల్లో నివసిస్తున్న హిందువులపై దౌర్జన్యాలను చేస్తూ హిందూ సంతతిని అంతమొందిస్తున్నారని, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ తదితర దేశాలలో ప్రస్తుతం హిందువుల పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉన్నదని 20 30 శాతం పైగా ఉన్న హిందువులు ప్రస్తుతం 2,3 శాతం లోపు మిగిలారని, వారిని సైతం ఉంటే మా మతంలోకి మారండి లేకపోతే దేశం విడిచి వెళ్ళండి, కాదుకూడదంటే అంతం చేస్పామని అక్కడ ఉన్న మతమూకలు దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులపై జరుగుతున్న నరమేధం చూస్తుంటే ఎంతో హృదయ విదారకంగా ఉన్నదని, మన పక్క దేశమే అని మనము మిన్నకుంటే రేపు మన గడప దాకా వస్తుందని ప్రతి ఒక్కరు గమనించి కులాల పేరిట వర్గాల పేరిట ప్రాంతాల పేరిట విడిపోయిన అందరూ ఒక్కటిగా హిందువులుగా హిందూ బంధువులుగా మారి ఎక్కడ ఏ ఇబ్బందులు తలెత్తినా ఒక్కటై కదలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం నుంచి ముందుకు సాగాలన్నారు. సమావేశంలో బి. సతీష్ మాట్లాడుతూ ప్రతి ఇంటి మహిళ హిందూ ధర్మం పట్ల మక్కువను పెంచుకొని తమ బిడ్డలను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు. రాబోవు వేసవి సెలవుల్లో యువకుల దేహదారుఢ్యం కోసం పోరాట విద్యలను హిందూ జన సంఘం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ శిక్షణా తరగతులలో ప్రతి ఒక్కరు పాల్గొని దేహదారుధ్యాన్ని పెంచుకోవాలని కోరారు. ఆపదలు వచ్చినప్పుడు ఎవరికోసమో ఎదురు చూడకుండా ఎదుర్కోవడానికి సమయత్తం కావాలన్నారు. ధర్మానికి అపాయం జరిగితే నేనే దిగివస్తానని కృష్ణ భగవానుడు గీతలో బోధించాడని, ఆ కృష్ణ భగవానుడు ఎక్కడో కాదు ప్రతి ఒక్కరులో ఉన్నాడని అది గుర్తించి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు.

సమావేశంలో బల్చా శ్రీనివాస్, ఏ. వేంకటేశ్వర్లు, బి. సతీష్, అధ్యక్షులు విశ్వాజుల లక్ష్మీ నారాయణ మూర్తి, నూనె రామాంజనేయులు సుంకు రఘు రాధా రమణ గుప్తా జంధ్యం బిఎంఆర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *