ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో వచ్చే ఆర్జీల పై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో వచ్చే ఆర్జీల పై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, లోకేశ్వర రావు లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ…. ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో వచ్చే ఆర్జీల పై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని హితవు పలికారు. వచ్చిన ప్రతి ఒక్క అర్జీ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి , ప్రతీ అర్జీకి అర్థవంతమైన సమాదానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన ఆర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితిల్లో అర్జీలు పెండింగ్ ఉండరాదని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్ లైన్ లో వచ్చిన వినతులను చూడాలని, అలాగే వచ్చిన అర్జీలకు సరైన పరిష్కారం చూపుతూ, రీ ఓపెన్ కేసు లు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.

ఈరోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో 223 వినతులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *