కాంగ్రెస్ ఇన్చార్జి, అసంఘటిత కార్మికుల, ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కురిచేడు రోడ్డులోని శ్రీసాయి వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కరిపిరెడ్డి శ్రీరామిరెడ్డి, జాషువా, మస్తాన్ వలి, సురేష్, ప్రతాప్ రెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.




