ప్రపంచం మొత్తం జరుపుకొనే ఏకైక పండుగ క్రిస్మస్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రిస్మస్ వేడుకలలో భాగంగా మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎస్సార్ నగర్ లోని క్రిస్టియన్ ఫెల్లో షిప్ చర్చి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారికి ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చర్చి కో ఫాస్టర్ జాయ్ సీమన్ పీఠర్, ప్రతినిధులు పాల్ బసవయ్య, జాకీర్ హుస్సేన్, జాకోబ్, షీబా పాల్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సంతోష్, అశోక్ యాదవ్, కూతురు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
