మానవ జీవితానికి మార్గదర్శి భగవద్గీత – శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం- భగవద్గీత కంఠస్థ పోటీ విజేతలకు బహుమతు అందజేత.

భగవద్గీతను అత్యద్బుతమైన గ్రంథం గా పేర్కొంటూ శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం ప్రతి ఒక్కరు తమ జీవనం, కుటుంబ సాఫల్యత కోసం భగవద్గీతను నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల చేత ప్రతిదినం ఒక శ్లోకాన్ని పఠింపచేయాలని, పఠించడంతోపాటు శ్లోకం యొక్క అర్థము, తాత్పర్యము తెలుసుకొని తమ జీవితాన్ని మలచుకోవాలని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో మార్గశిరమాసం గీతాజయంతిని పురస్కరించుకొని భగవద్గీత లోని 12వ అధ్యాయం భక్తి యోగం శ్లోకాల పఠన పోటీ నిర్వహించగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుండి 38 మంది పోటీలో పాల్గొనగా… మంగళవారం సాయంత్రం స్థానిక బాపూజీ గోశాల లో ఒంగోలు నగరం నుండి పోటీ లో పాల్గొన్న పోటీదారులు రాయసం రేవతి, లక్ష్మీ కుమారి, పువ్వాడ లక్ష్మీ సుప్రజ, చందోలు అనూరాధ, దోగిపర్తి విశాలాక్షి, సాయి స్వరూప్, కనమర్లపూడి రాధ, వేంకట నాగజ్యోతి, చందోలు ఇంద్రజ, దామరాజు భారతి, పద్మాలక్ష్మి, విష్ణు కుమార్, దేవి అపర్ణ, ధాత్రిశ్రీ, కాకర్ల జగదీశ్వరరావు లకు శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ తరఫున సత్కరించి, ప్రశంసా పత్రము, జ్ఞాపికను అందించారు.

ఈ కార్యక్రమంలో గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, కార్యదర్శి త్రిపురం మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, సభ్యులు నూనె రామాంజనేయులు, చలువాది బ్రహ్మయ్య, ధనిశెట్టి రామునాయుడు మరియు సుంకు రఘు, బి విజయ రావు, తీగల సత్యవతి, ధనిశెట్టి పావని, మద్దు అరవింద లక్ష్మి, దోగిపర్తి మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *