ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి – జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ఎన్ లక్ష్మానాయక్

ప్రకాశం జిల్లాలోని షెడ్యూల్డ్ కులము(ఎస్సి)లకు చెందిన ప్రజలు మరియు షెడ్యూల్డ్ కులము(ఎస్సి)ల సంఘ నాయకులు ఎస్సీ వర్గీకరణపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ఎన్ లక్ష్మణ్ నాయక్ కోరారు.
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు ననుసరించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప-వర్గీకరణపై విచారణ చేయడానికి, రాజీవ్ రంజన్ మిశ్రా, ఐ.ఏ.ఎస్., (రిటైర్డ్) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించబడినదని తెలిపారు. సదరు ఏకసభ్య కమిషన్ కార్యాలయము గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయ మొదటి అంతస్తు, కోనేరు లక్ష్మయ్య వీధి, మొఘల్రాజపురం, విజయవాడ 520010, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ నందు ఏర్పాటు చేయబడినదని తెలిపారు. ఈ విషయంపై ఏదైనా సంతకంతో కూడిన వ్రాతపూర్వక మొమోరాండం/ రిప్రజంటేషన్స్ లను, కార్యాలయపు పని వేళలందు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రము 5 గంటల 30 నిమిషముల వరకు వ్యక్తిగతంగా, లేదా తిరుగు రసీదుతో కూడిన రిజిస్టరు పోస్టు ద్వారా, లేదా ఇమెయిల్ ఐడి : omcscsubclassificaton@gmail.com ద్వారా 2025 జనవరి 9 వరకు అభ్యంతరాలను తెలపవచ్చని వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *