వైసీపికి జిల్లా ముస్లీం మైనార్టీ ప్రధాన కార్యదర్శి లతీఫ్ రాజీనామా

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం నకు చెందిన వైసీపికి జిల్లా ముస్లీం మైనార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ లతీఫ్ బుధవారం ఆ పార్టీ కి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో తమకు సరియైన ప్రాధాన్యత ఇవ్వనందుకు కినుక వహించి రాజీనామా చేసినట్లు సమాచారం. పార్టీ క్షేత్ర స్థాయిలో మండల స్థాయి నాయకులు….. సరియైన సమాచారం ఇవ్వక కార్యకర్తలకు మొదటి నుండి వైసీపీ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత తక్కువగా ఉందని, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై అభిమానంతో పార్టీలో కొనసాగామని, ఇకపై పార్టీలో కొనసాగలేమని సయ్యద్ లతీఫ్ ఉపఫ్ అత్తరు కోటయ్య తెలిపారు. ఇదే సమావేశానికి వెళ్లిన పలువురు క్రీయాశీలక కార్యకర్తలు సైతం సరియైన ప్రాధాన్యత లేదంటూ అలకవహించి ప్రధాన వైసీపీ వాట్సాప్ గ్రూప్ నుండి వైదొలిగారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *