నీటి వినియోగదారుల సంఘ ఎన్నికలలో ప్రతి ఒక్క పీఓ, ఎపీఓలు అప్రమత్తంగా ఉండి ఎన్నికల విధులు నిర్వహించాలని తహసీల్దార్ సంజీవ రావు కోరారు. ఎంపీడీఓ కార్యాలయం లోని సమావేశపు మందిరంలో బుధవారం సంఘ ఎన్నికల పీఓ లకు, ఎపీఓలకు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ కె. సంజీవ రావు మాట్లాడుతూ ….నీటి వినియోగదారుల సంఘ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ను 3 -ఏ ను ప్రతి పంచాయితీ కార్యాలయంలో ప్రదర్శించారని చెప్పారు. 14వ తేదిన ఓటర్లను అసాధారణ సర్వ సభ్య మండలి సమావేశమునకు అనుమతించాలని తెలిపారు. ప్రాదేశిక వర్గాల వారిగా ఓటర్లను అనుమతించే సమయంలో వారి పట్టాదారు పాస్ బుక్ లేదా 1 బిలను తహసీల్దార్, విఆర్ఓలతో దృవీకరించబడిన కాఫీలతో, సంబంధిత గుర్తింపు కార్డుతో అనుమతించాలని కోరారు. వీలైనంత వరకు ఎక గ్రీవాలు అయ్యే విధంగా చూడాలని సూచించారు. ఎంఈఓ – 1 జి సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్ రావులు ఎన్నిక అవసరమైన సమయంలో పాటించాల్సిన పద్ధతుల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె సుందర రామయ్య, డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఎఈఈలు కిరణ్ కుమార్ కోటేశ్వర రావు, ఎన్ వీ ఎస్ రామ్ కుమార్, డివీ శంకర రావు, జి ఈశ్వర రెడ్డి, ఎం సుబ్బా రావు తదితరులు పాల్గొన్నారు.


