తాళ్లూరు, కొత్త పాలెం ఆర్ అండ్ బి రోడ్ మధ్య గల చెరువు వాగు పశువుల వ్యర్థాలతో పూడి పోయి చప్టాపై నీరు చేరటంతో గుంతల మయం అయినది. పరిస్థితిని గమనించి ఎంపీడీఓ సుందర రామయ్య ఆదేశాలతో బుధవారం గ్రామ కార్యదర్శి ఐ వీ రమణా రెడ్డి ప్రొక్లయిన్ సహాయంతో పూడిక తీసి వేసారు. రోడ్ చప్టాపై నీరు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేసారు.
