రైతులు నూతనంగా వరి నాటిన భూములలో ఇనుప ధాతువు లోపం కనిపిస్తుందని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. లక్కవరం, దోస కాయల పాడు గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఇనుప ధాతులు లక్షణాలు, నివారణ చర్యలు గురించి వివరించారు. విఏఏ వీరాంజ నేయులు తదితరులు పాల్గొన్నారు.
