తాళ్లూరు మండలం బోద్ధి కూర పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఎంసి చైర్మన్ వై వి రామి రెడ్డి వాటర్ ప్లాంట్ కు సొంత నిధులతో మరమ్మత్తులు చేయించి విద్యార్థుల దాహత్తిని తీర్చారు.మండలంలోని బొద్దికూరపాడు జెడ్పి ఉన్నత పాఠశాలలో నాలుగేళ్ల తరువాత వాటర్ ప్లాంట్ కు రిపేరు చేశారు. దీంతో విద్యార్థుల దాహార్తి తీరుస్తుంది. 2020లో నాడు-నేడు పథకం క్రింద రూ.5 లక్షల విలువైన వాటర్ ప్లాంట్ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. నాటి నుండి నేటి వరకు వాటర్ ప్లాంట్ రిపేర్ చేయమని గత వైసిపి ప్రభుత్వంలో సుమారు 25 సార్లు విద్యాశాఖ ఉన్నతాధికారులకు, వాటర్ ప్లాంట్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. కానీ స్పందన లభించలేదు. వాటర్ ప్లాంట్ పని చేయనందున విద్యార్థులు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల మంచినీటి అవసరాన్ని, సమస్యను నూతనంగా ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ వైవి రామిరెడ్డి వినుకొండ నుండి మెకానిక్ను పిలిపించి రూ.10వేల సొంత నిధులను ఉపయోగించి ప్లాంట్లో పాడైపోయిన సామానులను తెప్పించి రిపేరు చేయించారు. దీంతో
విద్యార్థులు, ఉపాధ్యాయుల దాహార్తిని తీర్చుటకు కృషి చేసిన ఎస్ఎంసి చైర్మన్ వైవి రామిరెడ్డి, పోలంరెడ్డి రమణారెడ్డి, కోటిరెడ్డి, సుబ్బారెడ్డి, గంగిరెడ్డి శ్రీను, సన్నపురెడ్డి అంజిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు పి సుబ్బారావులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
