ధాన్యం కొనుగోలు పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు – పసుపు గల్లులో ధాన్యం కల్లాలను పరిశీలించిన జిల్లా వైసీపీ అధ్యక్షుడుఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి

రైతులను ఆదుకునే విషయంలో ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం ఆర్భాటమైన ప్రకటనలే తప్ప ఆచరణ శూన్యమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. మండలంలోని పసుపుగల్లు గ్రామంలో గురువారం వరి ధాన్యము, మొక్కజొన్న విత్తనాల కల్లాలను ఒంగోలు పార్లమెంటు ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం ,మొక్కజొన్న ,మిరప పంటలు కల్లాలలో చేరినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారని అన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఆర్ బి కే, సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఆదుకున్నారని అన్నారు. నాడు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రైతులకు బహిరంగ మార్కెట్లో మద్దతు ధరకు మించి గిట్టుబాటు ధరలు లభించాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ కింద 20 వేల రూపాయలు కూడా ఇవ్వకుండా పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రైతులు గత ప్రభుత్వంలో బస్తా రెండు వేల రూపాయలకు కొనుగోలు చేయగా ,ప్రస్తుత ప్రభుత్వంలో బస్తా 1450 రూపాయలకు మాత్రమే దళారులు అడుగుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైసిపి రైతుల పక్షాన న్యాయం జరిగే వరకూ పోరాటాలు చేసేందుకు వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పోరాటాలకు సిద్ధమైనట్లు చెప్పారు. పలువు రైతులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర సునీత, జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు, మండల వైసీపీ మాజీ కన్వీనర్ సూది దేవర అంజయ్య, వైస్ ఎంపీపీ బంక రమణమ్మ నాగిరెడ్డి, పసుపు గళ్ళు మాజీ సర్పంచి చింతా శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ సర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, ఇరుగుల కొండారెడ్డి, గొంది వెంకట అప్పారెడ్డి, ఎనుముల శ్రీనివాసరెడ్డి, అబ్బనీ అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *