ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాని వివాహిత మహిళ మిస్సింగ్ కేసు నమోదు.

బేగంపేట డిసెంబర్ 14 (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత మహిళ తిరిగి రాక పోవడంతో ఆమె భర్త పోలీసులకు పిర్యాదు చేశారు.ఆయన పిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి.ఉత్తర ప్రదేశ్ కు చెందిన రితేందర్ సింగ్ కు హసీబన్ (21)తో వివాహమైంది.వారిద్దరూ ఉపాధి కోసం ఈ ఏడాది జనవరి లో బాలం రాయి అన్నా నగర్ కు వచ్చారు. ప్రతిరోజు లాగానే రితేందర్ సింగ్ ఫిబ్రవరి రెండవ తేదీన ఇంటి నుంచి పనికి వెళ్ళాడు. అదే రోజు మధ్యాహ్నం అతని భార్య హసీబున్ మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళిందన్నారు. ఈ విషయాన్ని పక్కింటి వారు రితేందర్ సింగ్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారన్నారు. అయితే హసీబున్ ఆచూకీ కోసం బంధువులు స్నేహితులు ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదన్నారు. దీంతో బేగంపేట పోలీస్ స్టేషన్ లో రితేందర్ సింగ్ ఫిర్యాదు చేశాడన్నారు. అతని ఫిర్యాదు పై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జె నాగరాజు తెలియజేశారు. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో తెలుపు రంగు ఫ్రాక్ నలుపు రంగు బాటం ధరించి ఉందని ఎత్తు 5.2 అడుగులు ఉంటుందని హిందీ ,భోజపురి మాట్లాడుతుందని ఆమె ఆచూకీ తెలిసినవారు డయల్ 100 కు గాని బేగంపేట పోలీస్ స్టేషన్లో గాని సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *