పెండింగ్లో ఉన్న సర్పంచుల బిల్లులు వెంటనే చెల్లించాలి – ప్రజావాణిలో ఫిర్యాదు.

హైదరాబాద్ డిసెంబర్ 13
(జే ఎస్ డి ఎం న్యూస్)
మహాత్మా జ్యోతి బా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ ను రాష్ట్ర సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్యలు కల్సి వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన అసెంబ్లీ సమావేశంలో సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై చర్చ
జరిపి తమకు రావాల్సిన బకాయినిధుల్ని వెంటనే మంజూరు చేయాలని, తెలంగాణ రాష్ట్ర సర్పంచులను ఆత్మహత్యల నుండి కాపాడాలని కోరారు. జనవరిలో ఎన్నికలు అంటూ ప్రకటనలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా వున్న సర్పంచులు అయోమయానికి,ఆందోళనకు గురవుతున్నారనీ, ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించాలన్నారు. ఇప్పటికీ ప్రజావాణిలో తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ నాలుగు సార్లు వినతిపత్రం ఇచ్చామన్నారు.బిల్లులు చెల్లించాలంటూ సంవత్సర కాలం నుంచి శాంతియుతంగా అనేక ఉద్యమాలు నిర్వహించామన్నారు. ఈ నెల 16 తారీకు ముఖ్యమంత్రి మా బిల్లులు మంజూరు విషయమై మాట్లాడి స్పష్టమైన ప్రకటన చేయకపోతే ,మాకు రావాల్సిన నిధులు మంజూరు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని వారు ప్రభుత్వానికి తెలియజేసినారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *