తాళ్లూరు మండలంలో సాగు నీటి సంఘాల ఎన్నికల నేపధ్యంలో పోలింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండి నిర్వహించాలని తహసీల్దార్ కె సంజీవ రావు కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. మండలంలో బొద్దికూరపాడు -1, బొద్దికూరపాడు -2, తాళ్లూరు-1, తాళ్లూరు-2, మన్నేపల్లి-1, మన్నేపల్లి-2, నాగంబొట్ల పాలెం, సోమవర ప్పాడు మేజర్లకు , బొద్దికూరపాడు -3, లక్కవరం -1, 2, మన్నేపల్లి -3 చెరువులకు టీసీల ఎంపికను ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా టీసీ మెంబర్లకు పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు శుక్రవారం సంబంధిత రెవిన్యూ అధికారులను సంప్రదించి పన్నుల చెల్లింపులో నిమగ్నమైనారు. అధికార పార్టీ నాయకులు ఆయా టీసీల పరధిలోని క్రీయాశీలక నాయకులతో పోటీ విషయంపై చర్చలలో మునిగిపోయారు. ప్రతి పక్ష పార్టీ వై సీపీ నుండి మాత్రము ఈ ఎన్నికలలో పోటీకి ఎటువంటి స్పందన లేదు.
నీటి సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం
13
Dec