భూ సమస్యల పరిష్కారం కోసమే రెవిన్యూ సదస్సులని తహసీల్దార్ కె సంజీవ రావు అన్నారు. తురక పాలెంలో శుక్రవారం రెవిన్యూ సదస్సు నిర్వహించారు. సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తహసీల్దార్ కోరారు. పలు సమస్యలపై ఆరు దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డి ,సర్వేయర్ శ్రీనివాస రావు, విఆర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
