ముండ్లమూరు డిసెంబర్ 13 (జే ఎస్ డి ఎమ్ న్యూస్)
తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మప్రచారపరిషత్ ఆధ్వర్యంలో మండలంలోని శంకరాపురం గ్రామం శ్రీ కోదండ రామాలయం లో, తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు ఆద్వర్యలో, ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల టిటిడి కోఆర్డినేటర్లు జాస్టి లక్ష్మి వెంకటేశ్వర్లు దంపతుల నిర్వహణలో, లోక కళ్యాణం, గ్రామభివృద్ధి కోసం గత నాలుగు రోజులు నుంచి టిటిడి ధర్మా చార్యులు మాదాల దానయ్య మాస్టారు చే ధార్మిక ఉపన్యాసములు, స్తానిక టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు బజనమండలి సభ్యులచే భజన సంకీర్తనలు జరిగాయి. టిటిడి ఫొగ్రాం అసిస్టెంటు శ్రీ రావినూతల రామకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి సామూహిక కార్యక్రమాలవలన గ్రామంలో ప్రజలమద్య ఐక్యత,స్నేహ బంధం, పిల్లలకి ధార్మిక జీవన పద్ధతి, మహిళలలో చైతన్యం అవలంబిస్తాయాన్నారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం లో అనేక చోట్ల ఎన్నో ధార్మిక కార్యక్రమాలు హిందూధర్మపరిరక్షణలోభాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రకాశం,బాపట్ల,పల్నాడు జిల్లా ల పరిధిలో ఉన్న గ్రామాలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కార్యక్రమాలను జరిపించుకోవాలి అంటే తమను సంప్రదిస్తే ఇటువంటి కార్యక్రమాలు మీ గ్రామంలో కూడా నిర్వహించుకోవచ్చని అన్నారు.ఎంతో పవిత్రమైన శుక్రవారం రోజున 100 మంది మహిళలచే సామూహిక లక్ష్మీ కుంకుమపూజ కార్యక్రమాన్ని దేవాలయం అర్చకులు శేషగిరి శర్మ జరిపించారు. పూజలో పాల్గొన్న మహిళలకు పూజసామాగ్రి, లక్ష్మీ రూపులు,స్వామి వారి కంకనాలు,అక్షితలు,భగవద్గీత పుస్తకాలు టిటిడి వారు ఉచితంగా అందించారు. అధిక సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు. జాస్టి లక్ష్మి వెంకటేశ్వర్లు దంపతులు భక్తులకు అవసరంఅయిన వసతులు సమకూర్చారు, ఈ కార్యక్రమం లో టిటిడి దాస సాహిత్యప్రాజెక్ట్ ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల కోఆర్డినేటర్ శ్రీ చెన్నుపల్లి నాగేశ్వరావు,టిటిడి కొరిశపాడు మండల కోఆర్డినేటర్ రామిసెట్టి రవిబాబు, దేవాలయం కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు, భక్తులుపాల్గొన్నారు,అనంతరం భక్తులు అందరికీ ప్రసాద వితరణ చేశారు.టిటిడి ప్రోగ్రాం అసిస్టెంట్ రావినూతల రామకృష్ణ ఈ కార్యక్రమం నిర్వహించారు.
