జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను 33 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ తెలిపారు. అందులో దర్శి, మండ్లమూరు, త్రిపురాంతకం మండలాలో ఏర్పాటుచేసిన ఏడు కొనుగోలు కేంద్రాల ద్వారా 425 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 62 మంది రైతుల వద్ద నుండి సేకరించి ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపడం జరిగిందని తెలిపారు.
ఇప్పటివరకు రైస్ మిల్లుల వద్ద నుండి ఒక కోటి 50 లక్షలు బ్యాంకు గ్యారెంటీ తీసుకోవడం జరిగిందని తెలిపారు. మరియు రానున్న మూడు రోజుల్లో మరో మూడు కోట్లు బ్యాంకు గ్యారంటీ ఆయా రైస్ మిల్లులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి 62 మంది రైతులకు 94 లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడం జరిగిందని తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోనే మద్దతు ధర సొమ్మును సంబంధిత రైతు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు 650 టార్భాలిన్ పట్టలను కొనుగోలు చేయడం జరిగిందని, వర్షాభావ పరిస్థితుల వలన రైతులు టర్బాలిన్ పట్టలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
