జన హృదయ నేత వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శనివారం తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. తాళ్లూరులో వెల్లంపల్లి రోడ్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత నేతకు విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్ల పాటి మోషే, మాజీ జెడ్పీటీసీ ఎల్డీ వెంకటేశ్వరరెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, మందా శ్యామ్సన్, మాజీ సొసైటీ అధ్యక్షుడు, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, కోఆప్షన్ కరిముల్లా, మాజీ సొసైటీ అధ్యక్షుడు నాగి రెడ్డి, పులి ప్రసాద్ రెడ్డి, విష్ణు, పూర్ణ వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ను కట్చేసి పంచిపెట్టారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వీట్లు పంచి పెట్టారు. సుంకి రెడ్డి పాలెంలో మాజీ సర్పంచి ఇడమకంటి పెద్ది రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి పంచి పెట్టారు. రమణాల వారి పాలెంలో బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో మహిళలు కేక్ కట్ చేసి పంచి పెట్టారు. పలు గ్రామాలలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.



