హెల్మెట్ ఒక ప్రాణాన్ని కాపాడటమే కాకుండా ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా చేస్తుందని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు సింగరాయకొండ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ……వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కుటుంబ యాజమానిని కోల్పోయిన ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయ్యన్నారు.
హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని మంత్రి డా.డోలా సూచించారు.

