చీమకుర్తి మండలం బడ్లమూడి గ్రామంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కెటింగ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ .. .. రైతు చూడని కష్టం లేదు రైతు చూడని నష్టం లేదు……. దేశానికి వెన్నెముక ఐన రైతన్నలను గుర్తించి గౌరవించాలి అని అన్నారు. ముందుగా రైతులందరికి అంతర్జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు నాణ్యమైన ఎరువులు వినియోగం వాతావరణ పరిస్థితిని ఎదుర్కునే విధానాలు మరియు నానో ఎరువుల ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా నానో శక్తి యూరియా మరియు డిఏపి వాడకం గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు మంచిదిగుబడులు సాధించడానికి అవసరమైన కంపెనీ ఉత్పత్తులు ఎన్-20 జై ప్ మైట్ ప్లస్, బయో 20, వామాక్స్ వంటి వాటి గురించి వివరించారు. మిక్కీ మరియు మొక్కజొన్న పంటలకు సంబంధించిన సాగు పద్ధతులపై చర్చించారు మట్టి నమూనాలు సేకరణ విశ్లేషణ ప్రాముఖ్యత గురించి ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా ముగ్గురు ప్రగతిశీల రైతులు సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో పి.ప్రభాకర్ మార్కెటింగ్ అధికారి ఒంగోలు, ప్రణీత శ్రీహరికృష్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు.

