క్రీస్తు బోధనలు ఆచరణీయమని, పాపుల రక్షణ కోసం, శాంతి సందేశం కోసం దైవ దూతగా వచ్చి ఏసు మానవాళి కోసం రక్తం చిందించారు – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి

క్రీస్తు బోధనలు ఆచరణీయమని, పాపుల రక్షణ కోసం, శాంతి సందేశం కోసం దైవ దూతగా వచ్చి ఏసు మానవాళి కోసం రక్తం చిందించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ నందు సోమవారం సాయంత్రం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి పార్థసారథి, రెవ్. ఐజాక్ బాబు, రెవ. పి. విలియం కేరి, రెవ్. టి. ప్రేమ్ చంద్, రెవ. కె. సామ్రాట్, బిషప్ కె. నతానియల్, ఫాదర్ డి. ఎస్. పాల్, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ……….. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, దయామయుడు అయిన ఏసు మానవాళి కోసం రక్తం చిందించారన్నారు. ప్రేమకు, అభిమానానికి, సహనానికి, దయాకరుణకు మూర్తీభవించినటువంటి రూపమే జీసస్ అని అన్నారు. ఈ రోజు ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ పండుగని, వారి ఆశయాలను వ్యాప్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మేలు చేసేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014-19 కాలంలో పెద్ద ఎత్తున చర్చి ల నిర్మాణాలకు కృషి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల హక్కుల సంరక్షణకు కట్టుబడి వుందని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ……… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుచున్నదని, అందులో భాగంగానే ఈ రోజు జిల్లా యంత్రాంగం సెమి క్రిస్మస్ వేడుకలను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజు ఎవరైతే పేద ప్రజలతో దయతో ఉంటారో, వారికి క్రీస్తు ఆశీస్సులు ఉంటాయని, పేద ప్రజలతో ప్రేమతో దయతో వుండాలని భోధించిన మహనీయులు ఏసుక్రీస్తు అని, వారి గొప్పసందేశాన్ని ప్రతి ఒక్కరు పాటించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్రిస్మస్ అంటే గుర్తుకు వచ్చేది ప్రేమ, శాంతి, దయ, కరుణ అని అన్నారు. నా అనే పదాన్ని వదలి మన, మన వూరు, మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం అని ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నారు. శత్రువులను ప్రేమించాలని, వారి తప్పులను క్షమించాలని బోధించిన క్ర్రీస్తు శాంతిదూత అని కొనియాడారు.. జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు

నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ………… క్రీస్తు జననం ప్రపంచానికి వెలుగని, ప్రేమ..శాంతితో జీవిస్తూ ఆ ప్రేమమూర్తి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు.

జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ మాట్లాడుతూ, ప్రపంచం మొత్తం పేమతో నిండి ఉండాలి, ఒకరినొకరు ప్రేమ, గౌరవం కలిగి వుండాలని, అలాగే ప్రపంచం మొత్తం శాంతి సౌభాగ్యలతో ఉండాలని, నిస్వార్ధ తత్వం కలిగి వుండాలని ఏసుక్రీస్తు భోదించారని, దానికి మానవులంతా ఏకమై వారి భోదనల ఆచరణకు కృషి చేయాలన్నారు. ఏసుక్రీస్తు భోధనలు వినడంతో పాటు వాటిని ఆచరించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ సందర్భంగా ఏసుక్రీస్తును కీర్తిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్లు, సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *