ప్రకాశం జిల్లా ప్రవేటు విద్యాసంస్థల సంఘ మైన APTCA ఇక నుండి రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ (APPSA) కు అనుబంధంగా ఉండబోతోందని ఏ పి టి సి ఏ నాయకుడు మాంటిస్సొరి ప్రకాష్ తెలిపారు .అప్సా రాష్త్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం అప్సా రాష్ట్ర గౌరవాధ్యక్షులు సుందర రావు తో ఏ పి టి సి ఏ ప్రతినిధుల బృందం తొ మాంటిస్సోరి హై స్కూల్ లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయడం జరిగింది నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొద్దీ కాలంలోనే 30 కి పైగా విద్యా సంస్కరణలకు అప్సా దోహదం చేసిందని విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ విద్యాశాఖ లోని ఉన్నతాధికారులు ఎంతో సహకరిస్తూ ప్రవేటు విద్యా సంస్థలు మరీ ముఖ్యంగా చిన్న చిన్న బడ్జెట్ విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరిస్తుంన్నారని అప్సా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సుందర రావు తెలిపారు. అప్సా రాష్ట్రం లోని 26 జిల్లాలలోను చాల పటిష్టంగా పనిచేస్తోందని అప్సా రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తెలిపారు . త్వరలో జరగబోయే ప్రకాశం జిల్లా అసోసియేషన్ ఎన్నికల అనంతరం ప్రమాణస్వీకారానికి 26 జిల్లాల నాయకులు హాజరవుతారని సుందరరావు తెలిపారు .
50 సంవస్సరాల అనుభవం కలిగిన ఏ పి టి సీ ఏ అనేకజిల్లాలలో అప్సా గా రూపాంతరం చెందిందని కావున అప్సాకు మాతృసంస్థ అయిన ఏ పి టి సి ఏ కలిసి పనిచేయడం శుభసూచికమని ప్రకాష్ బాబు తెలిపారు . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జాలిరెడ్డి పట్టణ అధ్యక్షరాలు చందమామ లక్ష్మి రామి రెడ్డి, శ్రీరాముల రెడ్డి ,అజయ్ , సిబి మైఖేల్ ,కొల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు


