ఎస్సీ వర్గీకరణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ జనాభా వివరా లపై సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను ఈ నెల 26వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు. దీనిపై జిల్లాలోని ఎస్సీ పౌరులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31వ తేదీ లోపు సచివాలయాల్లో అందించాలని పేర్కొన్నారు. జనవరి 6వ తేది వరకు వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి 10వ తేదీ కులగణన తుది వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలి పారు. వచ్చిన అభ్యంతరాలను మూడు దశల్లో తనిఖీ చేస్తామన్నారు. తొలుత వీఆర్ ఓ లు
అభ్యంతరాలను పరిశీలించి మండల రెవెన్యూ అధికారికి అందజేస్తార న్నారు. తర్వాత ఆర్.ఐ పునఃపరిశీలించి తహసీల్దారుకు నివేదిస్తారన్నారు. ముగ్గురు నివేదికలను పరిశీలించి తుది ఆమోదం తెలిపిన తర్వాత పోర్టల్లో పొందుపరు స్తామని వివరించారు. పొందు పరిచిన వివరాల్లో కచ్చితత్వం కోసం జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సాంఘిక సంక్షే అధికారులతో 50మంది వివరాలను ర్యాండమ్ గా తనిఖీ చేస్తామన్నారు. ఎస్సీ పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని సహకరించాలని కోరారు.
