అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బ్యాక్ లాగ్ విద్యార్థులకు గొప్ప సదవకాశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2015, 2016 విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సులు చదివి వివిధ కారణాలతో మధ్యలో ఆపివేసిన బ్యాక్ లాగ్ విద్యార్థులకు ఆ కోర్సులను తిరిగి పూర్తి చేయడానికి మరొక సదవకాశాన్ని కల్పించడం జరిగిందని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ మారోజు రామాచారి గురువారం తెలిపారు. బిఏ, బీకాం, బీఎస్సీ కోర్సులలో చేరి ప్రధమ,ద్వితీయ, తృతీయ సంవత్సరపు పరీక్షలు రాయని విద్యార్థులు ఈ సదవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రీ అడ్మిషన్ పొందడానికి, బ్యాక్ లాగ్ పరీక్షలు రాయడానికి ఈనెల 31 వరకు ఆన్ లైన్ లో ఫీజులు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. వచ్చే జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 2 వ తేదీ వరకు తృతీయ సంవత్సరం విద్యార్థులకు, ఫిబ్రవరి 3 వ తేదీ నుండి 8వ తేదీ వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు, జనవరి 28 వ తేదీ నుండి 31వ తేదీ వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని ఆయన చెప్పారు. తృతీయ,ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు, ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సదవకాశాన్ని బ్యాక్ లాగ్ విద్యార్థులు వినియోగించుకుని తమ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో కాని, 9885494588 నంబర్ ను సంప్రదించి తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *