కొండభూమికి అక్రమ రికార్డులుసృష్టించిన రెవెన్యూసిబ్బందిపై చర్యలు తీసుకోవాలి – రెవెన్యూ సదస్సులో వెలుగువారిపాలెం గ్రామస్తుల విన్నపం

కొండభూమికి అక్రమ రికార్డులుసృష్టించిన రెవెన్యూసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తహసీల్దార్ కె.సంజీవరావుకు వినతి పత్రం అందజేశారు. వెలుగువారిపాలెం గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగింది. ఎంతో కాలంగా గ్రామంలో పశు వుల, గొర్రెలు, మేకల పెంపకందార్లు ఆకొండకు జీవాలను మేత మేపుకు తోలుకుని వెలుతుంటారన్నారు. కొండను తమ ఇష్టాను సారం గ్రావెల్ ను తరలిస్తున్నందున కొండ నామ రూపాల్లేకుండా పోతున్నదన్నారు. భవిష్యత్తు లో మేత మేపుకు ఇబ్బందిగా వుంటుదని, గ్రావెల్ తరలించ కుండా తగు చర్యలు చేపట్టాలని విన్నవిస్తూ వినతిపత్రం అందజేశారు. అదే కొండకు గ్రామంలో 6గురు వ్యక్తులు అక్రమంగా పట్టాలు పొదేందుకు నకిలీ రికార్డులు సృ ష్టించారని వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని, నకిలీ రికార్డులు సృష్టించేం దుకు సహకరించిన తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగిపై శాఖ పరచర్యలు తీసుకోవాని, వారిపై కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు తహసీల్దార్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేశారు. గ్రామాల్లో రెవెన్యూ సమస్యలపై 13 దరఖాస్తులు వొచ్చాయి.ఈ కార్యక్రమంలో విఆర్వో శివారెడ్డి, నాయకులు శాగం కొండారెడ్డి, ఎం బ్రహ్మారెడ్డి, నాగిరెడ్డి రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *