దేహదారుఢ్య పరీక్షలకు సర్వం సిద్ధం:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ – రేపటి నుంచి జనవరి 10 వరకు నిర్వహించే పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ కు పరేడ్‌ గ్రౌండ్‌లో ట్రైల్‌ రన్‌ సక్సెస్‌ – హాజరుకానున్న 5345 మంది అభ్యర్థులు… అడ్మిట్‌ కార్డు ఉన్న అభ్యర్థులకే అనుమతి -అభ్యర్థులు అడ్మిట్ కార్డులో నిర్దేశించిన తేదీ,సమయాల్లో ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలి – ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు…. దళారీలు మాటలు నమ్మి మోసపోవద్దు

ప్రకాశం జిల్లా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆదివారం ఉదయం జిల్లా ఎస్పీ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఫిజికల్ ఈవెంట్ సంబంధించి ట్రైల్‌ రన్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB) ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్స్ (సివిల్ & ఎపిఎస్పి) ఎంపిక కోసం ప్రిలిమినరీ టెస్ట్ పాసైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ & ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ లను డిసెంబర్ 30 నుండి జనవరి 10 వరకు ఒంగోలులోని జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించే ద్వారం మొదలుకొని, ధ్రువపత్రాల పరిశీలన, ధ్రువపత్రాల కంప్యూటరీకరణ, దేహదారుఢ్య పరీక్షలు ముగించుకొని వెళ్లే ద్వారం వరకు చేపట్టవలసిన ప్రక్రియకు సంబంధించి పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రతి పరీక్ష ఘట్టాన్ని సూచించే విధంగా సూచిక బోర్డులు మరియు ప్రతి ఒక్క ఈవెంట్ ట్రైల్‌ రన్‌ ను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, పోలీసు అధికారులు మరియు సిబ్బంది, పోలీస్ కార్యాలయ సిబ్బందికి, వారికి వారి యొక్క ఇది విధానాలపై పలు సూచనలు తెలియజేశారు.
ఈ ఈవెంట్స్ కు 5345 మంది అభ్యర్థులు (4435 మంది పురుషులు, 910 మంది స్త్రీలు) పాల్గొంటున్నట్లు తెలిపారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్‌ సిబ్బంది అడ్మిట్‌ కార్డు ఉన్న అభ్యర్థులను గ్రౌండ్ లోకి అనుమతిస్తారని, ప్రతి ఈవెంట్‌ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించినట్లు తెలిపారు.
రిక్రూట్మెంట్‌ బోర్డు అభ్యర్థులకు కేటాయించిన తేదీల్లో హాజరయ్యేలా సమయపాలన పాటిస్తూ తమతోపాటు అడ్మిట్‌ కార్డు, సంబంధిత సర్టిఫికెట్ల తీసుకోని రావాలన్నారు. దేహ దారుఢ్య పరీక్షలు ఎటువంటి లోపాలు లేకుండా పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు, 1600 మీటర్ల పరుగు,100 మీటర్లు పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్స్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేమని, అభ్యర్థుల కొరకు వైద్య శిబిరం, మంచినీరుతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు తెలియచేయాలని సూచించారు.
ఈ ట్రైల్‌ రన్‌ లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరరావు, డీపీఓ AO రామ్మోహన్ రావు, ఐటి కోర్ సీఐ వి.సూర్యనారాయణ, ఆర్ఐ లు రమేష్ కృష్ణన్, రమణారెడ్డి, డీపీఓ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *